Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 August 2025, 7:07 pm Posted by : ramakrishna

సుర్బిర్యాల్ గ్రామంలో అక్రమ నిర్మాణాలు సీజ్

  • చట్టమే అంతిమమని రుజువు
  • విడిసిల ఆధిపత్యానికి చెక్

 

ఆర్మూర్, బతుకమ్మ : ఆధిపత్యం, అణచివేత, సామాజిక వెలివేత, చట్టం మాకు లెక్కలేదనే భావాజాలం, మేము చేసిన తీర్మాణమే అంకుశం అంటు పెడపోకడలకు పోయిన గ్రామ అభివృద్ధి కమిటీల అన్యాయపు ఆగడాలు అంతం అయ్యేదిశగా అడుగులు పడుతున్నాయా అంటే అవుననే అనుకోవాల్సి వస్తున్నది. ఒక కులాన్నే లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం దృష్టిలో పడిన తాళ్ళ రాంపూర్ గ్రామ అభివృద్ధి కమిటీ అఖరుకు జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. వి. ఎన్ భారత లక్ష్మీ, సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు, జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఆర్మూర్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ వెంకటేశ్వర్ రెడ్డి లు అందరు కలసి తాళ్ళ రాంపూర్ లో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేసి చట్టం విలువ, గ్రామలలో విడిసిల చట్ట వ్యతిరేక చర్యలు వద్దంటు చేసిన హితబోధను విన్న విడిసిలు క్రమక్రమంగా న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థల ఆలోచనకు ఆచరణ రూపం ఇస్తున్నాయి. తాళ్ళ రాంపూర్ విడిసి రద్దు చేసుకుని ఆదర్శంగా నిలుస్తున్నది. బహిష్కరణలు, జరిమానాలు, సాంఘిక వెలివేతలు లేని గ్రామంగా మారబోతున్నది. తాజాగా ఆర్మూర్ మండల పరిధిలోని సుర్బీర్యాల్ గ్రామంలో సర్వజన సంగం రద్దుచేసుకొని అధికార వ్యవస్థలతో కలిసి నడవబోతున్నది. సుర్బీర్యాల్ గ్రామంలో నీటి పారుదల శాఖ స్థలంలో నిర్మించిన కమర్సియల్ కాంప్లెక్స్ కు గ్రామ పంచాయతీ అనుమతి ఉన్నదా లేదా అనేది విచారించి, మడిగెల కిరాయి డబ్బులు ఎవరి జేబులోకి వెళుతున్నాయో నివేదిక సమర్పించాలని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆదేశించడంతో నివేదికలు రూపొందించిన ఆర్మూర్ మండల తహసీల్దార్, నీటిపారుదల శాఖ అధికారులు గ్రామంలో చెరువు స్థలంలో అక్రమంగా కమర్సియల్ కాంప్లెక్స్ నిర్మించారని తేలడంతో మడిగెల లలో కిరాయికి ఉన్నవారికి నోటీసులు ఇచ్చి మడిగెలను మూసివేయించిన అధికారులు. చట్టం ఉన్నది దానిని అమలు చేయడమే కావలసింది.రెండు వివాదాలు తాళ్ళ రాంపూర్, సుర్బీర్యాల్ విడిసి లలో మార్పు మరికొన్ని విడిసిలకు ఆదర్శప్రాయంగా నిలవాలని బుద్దిజీవుల బలమైన కోరిక. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కృషి, పోలీసు, కార్యనిర్వాహక శాఖల సహకారం వెరసి ఉమ్మడి కార్యాచరణ కార్యరూపం దాల్చిందని తాళ్ళ రాంపూర్, సుర్బీర్యాల్ గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.