యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

తూతూ మంత్రంగా అధికారుల తీరు   బతుకమ్మ, కోటగిరి:  ఒక వైపు అక్రమ ఇసుక రవాణా ను అరికట్టడం కోసం ప్రభుత్వం, అధికారి యంత్రాంగం అహర్నిశలు కష్టపడుతుంటే  మరో వైపు ఇసుక బకాసురులు మాత్రం  మంజీరా నదికి గర్భశోకం మిగులుస్తున్నారనే చెప్పవచ్చు. అందుకు నిదర్శనంగా  పోతంగల్ మండలం కోడిచెర్ల గ్రామంలో శుక్రవారం రాత్రి అక్రమ ఇసుక రవాణా నిలువలను అధికారులు స్వాధీనం చేసుకున్నప్పటికీ  ఆదివారం టిప్పర్ల ద్వారా ఇసుక అక్రమంగా రవాణా చేయడం గమనార్ధం. సంబంధిత అధికారుల నిఘా ఉన్నప్పటికీ అక్రమ ఇసుక రవాణాను ...