Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 June 2025, 12:40 pm Posted by : ramakrishna

అక్రమంగా ఇసుక తరలింపు : లారీ పట్టివేత

వేల్పూర్, బతుకమ్మ: మండలంలోని జానకంపేట్ గ్రామ శివారులో బుధవారం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. TS15UC6594 నంబర్ గల లారీ పచ్చల్నాడుకుడ నుంచి ఆర్మూర్ వైపు వెళ్తుండగా ఆపి తనిఖీ చేయగా ఎటువంటి ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. లారీ డ్రైవరు దియోవల్ వినయ్ ని విచారించారు. జక్రాన్ పల్లి మండలం బ్రాహ్మణపల్లి కి చెందిన మహిపాల్ వద్ద గత రెండేళ్ల నుంచి లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నానని తెలిపారు. ఇద్దరం కలిసి అక్రమంగా డబ్బులు సంపాందిచాలనే ఉద్దేశ్యంతో ఇసుకను జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల వాగు నుంచి అక్రమంగా తరలించి బయట వ్యక్తులకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నారు.  ఇద్దరి పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి ఇసుక లారీ ని పీ‌ఎస్ కి తరలించారు. కేసు నమోదు చేశామని ఎస్ ఐ సంజీవ్ తెలిపారు.