Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 May 2026, 6:20 pm Posted by : ramakrishna

పర్మిషన్ పేరుతో పట్ట పగలు ఇసుక అక్రమ రవాణా

 

. . . పర్మిషన్ ఒకచోట . . . అన్ లోడింగ్ మరో చోట

 

. . . ఇసుక వ్యాపారుల ఇష్టారాజ్యం

 

. . . పట్ట పగలు కాసుల వర్షం కురిపిస్తున్న ఇసుక వ్యాపారం

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

పర్మిషన్ పేరుతో ఇందల్వాయి మండల కేంద్రంలో ఇసుక వ్యాపారులు సిండికేట్ గా మారి పట్టపగలు ఇసుక అక్రమ రవాణా చేస్తున్న పట్టించుకున్న నాథుడు కరువయ్యాడు. ఈ మేరకు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఇందల్వాయి తాసిల్దార్ ఇసుక పర్మిషన్ ఇవ్వగా ఇసుక మాఫియా సిండికేట్ గా మారి పర్మిషన్ ఒక చోట ఇసుక అన్ లోడింగ్ మరోచోట నిర్వహిస్తూ పట్టపగలు కాసుల వర్షం కురిపిస్తున్న అడ్డుకున్న నాథుడు లేకపోవడం గమనార్హం. దీనికి తోడు గ్రామాలలో రెవిన్యూ వ్యవస్థ లేకపోవడం కూడా ఇసుక వ్యాపారులకు వరంగా మారిందని పలువురు చర్చించుకుంటున్నారు. పంచాయతీ కార్యదర్శులు పని ఒత్తిడిలో ఉండి ఇసుక మొరం అక్రమ రవాణా ను పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో ఇసుక వ్యాపారులకు మూడు పూలు ఆరు కాయలు అన్న చందంగా ఇసుక వ్యాపారం మారిందని పలువురు చర్చించుకుంటున్నారు. పోలీసులు సైతం ఇసుక మాఫియాతో సంబంధాలు పెట్టుకున్నారని విమర్శలు ఉన్నాయి. ఎస్ఐ స్థాయి అధికారులు రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తే స్వయంగా ఇసుక సిండికేట్ వ్యాపారులకు సమాచారం ఇస్తూ ఇసుక మాఫియాకు పరోక్షంగా సహకారాన్ని అందిస్తున్నారని సమాచారం. అటవి శాఖలో సైతం రహీం అధికారి తెలియకుండానే రాత్రి పెట్రోలింగ్ నిర్వహించే సిబ్బందికి ముడుపులు భారీగా ముడుతున్నాయని మండలానికి చెందిన పలువురు చర్చించుకుంటున్నారు.

 

Illegal sand transportation in broad daylight in the name of permission

 

డ్రైవర్ స్థాయి మొదలుకొని బీట్ అధికారుల వరకు ఇసుక మాఫియా కనుసన్నల్లో పనిచేస్తున్నట్లు విశ్వసనీయంగా ఉన్న సమాచారం. అయినా అధికారులు తమ తమ సిబ్బంది తీరును మార్చుకునే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. ఏది ఏమైనా పట్టపగలు ఇసుక మాఫియా కాసుల వర్షం కురిపిస్తుంటే ప్రజలు అధికారులు ఇసుక మాఫియాకు సరెండర్ కావడంపై పలువురు మండల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పర్మిషన్ పేరుతో ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక మాఫియా పై స్థానిక తహసిల్దార్ కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కిందిస్థాయి రెవిన్యూ అధికారులు మామూళ్ల మత్తులో మునిగి పది ట్రిప్పుల పర్మిషన్ ఉంటే 30 ఇసుక ట్రిప్పులు కొట్టుకునేందుకు అవకాశం ఇవ్వడం కొస మెరుపు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించి భూగర్భ జలాలు అడుగంటకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇసుక మాఫియా ఆగడాలను ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసి అరికట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

. . . ఇసుక మాఫియా అక్రమాలపై విచారణ జరిపిస్తాం

. . . ఇందల్వాయి తాసిల్దార్ బాలయ్య

ఇందల్వాయి మండలంలోని వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇసుక రవాణా నిమిత్తం పర్మిషన్ తీసుకున్న ఇసుక మాఫియా అక్రమంగా వ్యాపారం చేయడం సరైంది కాదని వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఇందల్వాయి తాసిల్దార్ బాలయ్య వెల్లడించారు. ఇందల్వాయి మండల కేంద్రంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను అక్రమంగా వ్యాపారం చేస్తున్నారని పలువురు తమ దృష్టికి తేవడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. నేటి నుండి ఇసుక పర్మిషన్ పేరుతో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి ఉన్నచోట కాకుండా మరోచోట వేస్తూ కాసుల వర్షం కురిపిస్తున్న ఇసుక మాఫియా పై ఉక్కు పాదం మోపురం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇసుక పర్మిషన్ విధులలో ఉన్నటువంటి రెవిన్యూ సిబ్బందిపై సైతం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

Illegal sand transportation in broad daylight in the name of permission