Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 9:30 am Posted by : ramakrishna

తగ్గేల్లి మంజీరాలో ఇసుక అక్రమ రవాణా

 

. . . సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి

 

. . . జిల్లా కలెక్టర్, సీపీకి గ్రామస్తుల విజ్ఞప్తి

 

సాలూర, బతుకమ్మ :

 

సాలూర మండలం తగ్గేల్లి ప్రాంతంలోని మంజీరా నది నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఇసుక అక్రమ రవాణా విషయంలో వసూళ్లకు సంబంధించిన ఆరోపణలు, అధికారికి రూ.25 వేల మామూళ్లు అంటూ వచ్చిన వార్తలపై స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే సైతం సీరియస్‌గా స్పందించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.అయితే ఈ పరిణామాల తర్వాత కూడా ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ రవాణా వెనుక ఎవరెవరి పాత్ర ఉందో సమగ్రంగా దర్యాప్తు చేసి, బాధ్యులుగా తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, సీపీని గ్రామస్తులు కోరుతున్నారు.స్థానిక అధికారులపై నమ్మకం లేకపోవడంతో తమ సమస్యను చిత్ ఫోర్స్ దృష్టికి తీసుకెళ్లేందుకు గ్రామస్తులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మంజీర నుంచి జరుగుతున్న ఇసుక తరలింపుపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని వారు కోరుతున్నారు.ఇసుక అక్రమ రవాణా, వసూళ్లకు సంబంధించిన ఆరోపణలపై అధికారికంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు పేర్కొంటున్నారు.

Illegal sand mining in the Manjira river at Thaggelli