Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 June 2026, 7:01 pm Posted by : ramakrishna

అక్రమ మొరం తవ్వకాలు నిలిపివేయాలి

 

.  . .   సమీకృత మండల సముదాయ కార్యాలయం ఎదుట గ్రామస్తులు ధర్నా

 

రుద్రూర్, బతుకమ్మ  :

 

అక్రమ మొరం తవ్వకాలు నిలిపివేయాలని రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామస్తులు సోమవారం తహాసిల్దార్ కు వ్యతిరేకంగా సమీకృత మండల సముదయ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ అక్బర్ నగర్ గ్రామ శివారులో గల గుట్టకు మొరం త్రవ్వకాలు చేపట్టడానికి తహసిల్దార్ బయటి ఊరు వారికి విచ్చలవిడిగా అనుమతులు ఇస్తున్నారు. కానీ గ్రామ ప్రజలకు మాత్రం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలకు కొరకు మొరం తవ్వకానికి వేబిల్ తప్పనిసరి అని అన్నారు. గ్రామస్తులుగా మేము దానికి వ్యతిరేకంగా ఆ తవ్వకాలను నిలిపి వేశమని, దానిని దృష్టిలో పెట్టుకొని గ్రామంలో హిందూ స్మశాన వాటికలో కీస్టోన్ కంపెనీ వారు దానిని అభివృద్ధి చేసి ఇస్తాం అంటే గ్రామ సభలో తీర్మానం చేసి ఇచ్చామన్నారు. తహసీల్దార్ వేబిల్ ఇచ్చిన మొరం తవ్వకాలు ఆపివేశారని కనుక మీ స్మశాన వాటిక కూడా నేను నడవనివ్వనని ఆ అభివృద్దిని అడ్డుకున్నారని పేర్కొన్నారు. అంటే ప్రజా ప్రయోజనం కోసం గ్రామస్తులకు ఉపయోగపడే వాటికి అనుమతి ఇవ్వకుండా తహసీల్దార్ కు ఆదాయం సమకూర్చే వాటికి ఎక్కువ మక్కువ చూపుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఇక నుండి గ్రామంలో గ్రామస్తులకు కాకుండా బయటి వ్యక్తులకు మొరం ఇవ్వమని అన్నారు. తక్షణమే తహసీల్దార్ స్మశాన వాటిక పనులను కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేని యెడల దేనికైనా గ్రామస్థులు అందరం సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కార్తీక్, అశోక్ గౌడ్ , గౌతం, రజాక్, ఫహీమ్, రాకేష్, పవన్, మొహమ్మద్, అజార్ , ఇమ్రాన్, వినయ్, అశోక్ కాంబ్లె, సాయిలు తదితరులు పాల్గొన్నారు.