యథేచ్ఛగా మొరం అక్రమ తవ్వకాలు
అనుమతుల పేరిట మొరం అక్రమ దందా బతుకమ్మ, బిచ్కుంద : మొరం దందా అక్రమ యథేచ్ఛగా కొనసాగుతోంది. కొందరు అక్రమార్కులు సహజ సంపదను కొల్లగొట్టి ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. బిచ్కుందలో మొరం తవ్వకాలు జరుపుతున్న స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండానే తవ్వకాలు సాగిస్తుండడంతో లక్షల రూపాయల్లో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. బిచ్కుంద గ్రామంలోని శివారులో ఉన్న గుట్టలను కొందరు అక్రమార్కులు అనుమతులు పేరిట అక్రమ తవ్వకాలు జరుపుతూ గుట్టలను కరిగిస్తున్నారు. గుట్టను పందికొక్కుల తోడేస్తున్నారు. నిఘా బెట్టి చర్యలు చేపడుతున్నామని...