Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 February 2026, 6:24 pm Posted by : ramakrishna

కెనాల్ ప్రక్కన అక్రమంగా చెట్ల నరికివేత

 

. . . నిద్రమత్తులో ఇరిగేషన్ శాఖ అధికారుల

 

రుద్రూర్, బతుకమ్మ :

 

మండలంలో కెనాల్ ప్రక్కన ఉన్న చెట్లు గొడ్డలి వేటుకు గురవుతున్నాయి. రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్ గ్రామ కెనాల్ ప్రక్కన సోమవారం రోజున కొందరు వ్యక్తులు ఇరిగేషన్ శాఖ అధికారుల పేర్లు చెప్పి అక్రమంగా చెట్లను నరికి వేస్తున్నారు. కెనాల్ కు 20 మీటర్ల దూరంలో ఉన్న తుమ్మ చెట్లు, వివిధ రకాల చెట్లను అక్రమంగా నరికి వేస్తూ ట్రాక్టర్లలో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇష్టారాజ్యంగా చెట్లను నరికేస్తున్నా ఇరిగేషన్ శాఖ అధికారులు పట్టించుకోకుండా నిద్ర మత్తులో మునిగి తెలుతున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఇరిగేషన్ శాఖ అధికారులు వెంటనే స్పందించి కెనాల్ పక్కన అక్రమంగా చెట్లను నరికి వేస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

 

Illegal felling of trees near the canal