అర్ధరాత్రులు అక్రమంగా మొరం తవ్వకాలు
మల్లారం గాంధీనగర్ వద్ద భారీగా మొరం తవ్వకాలు రాత్రివేళ నగరానికి మొరం రవాణా జరిమానా విధించిన అటవీ అధికారులు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మల్లారం శివారులోని గాంధీనగర్ వద్ద మొరం తవ్వకాలు జరుగుతున్నాయి. రెవెన్యూ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే రాత్రివేళ యథేచ్చగా ఎర్రమట్టిని తరలిస్తున్నారు. చింతల్ చెరువు శిఖంలో రెవెన్యూ భూమిలో రాత్రికి రాత్రి గుట్టను తవ్వేస్తున్నారు. హిటాచి మిషన్లను పెట్టి రాత్రివేళ తవ్వకాలు చేస్తూ నగరానికి మొరాన్ని తరలిస్తున్నారు. అందుకోసం రెవెన్యూ భూమిలో పెరిగిన...