అక్రమ డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలి

భారతీయ విద్యార్థి మోర్చ  రాష్ట్ర కార్యదర్శి జీవియం విఠల్  కామారెడ్డి, బతుకమ్మ :  అక్రమ డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలని భారతీయ విద్యార్థి మోర్చ  రాష్ట్ర కార్యదర్శి జీవియం విఠల్ డిమాండ్ చేశారు. పట్టణంలోని జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్నటువంటి కొంత మంది ఉపాధ్యాయులు కావాలని వారికి కావాల్సిన చోటకు డిప్యూటేషన్లను జిల్లా విద్యాశాఖ అధికారి సహకారంతో వేసుకుంటున్నారని అన్నారు. గతంలో ఇదే విషయమై కలెక్టర్  దృష్టికి తీసుకెళ్తే...