నిజాంసాగర్ కాలువ భూములపై అక్రమ నిర్మాణాలు
"మనకు ఎందుకు?" అనే ధోరణిలో అధికారులు కాలువ భూములను కబ్జా చేసి ఇళ్ల నిర్మాణాలు నందిపేట్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా నందిపేట, తల్వేద, వన్నెల్(కె) గ్రామ శివారులో గల నిజాంసాగర్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ-73 (డి-73) కాలువ భూముల పై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ ప్రాంతంలో భారీ స్థాయిలో ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం కొనసాగుతుందని స్థానికులు విమర్శిస్తున్నారు. వన్నెల్(కె) గ్రామంలో ఇప్పటివరకు డి-73...