రైతులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి
బతుకమ్మ,మోర్తాడ్: లగచర్ల రైతులపై అక్రమంగా నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని, రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మోర్తాడ్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. రైతులను అక్రమంగా అరెస్టు చేసి వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించిన విధానాలకు నిరసనగా టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి నిరసన తెలిపారు. కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ అన్ని మండలాల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,...