Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 June 2025, 4:35 pm Posted by : ramakrishna

జర్నలిస్టులను అక్రమ అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం

రుద్రూర్, బతుకమ్మ: ఆంధ్రప్రదేశ్ లో సాక్షి మీడియా జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ రావును పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ  మంగళవారం రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో వర్ని, రుద్రూర్, కోటగిరి మండలాల పత్రికా, మీడియా జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ తారాబాయికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. సాక్షి మీడియా జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్ రావును బేషరత్తుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వీరికి సీపిఎం పార్టీ ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ మద్దతు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో జర్నలిస్టులు నూత్ పల్లి గణేష్, రమేష్, నాగేష్, సాయిలు, ఉమాకాంత్, నర్సింలు, పెంటయ్య, హరీష్, సీపిఎం పార్టీ నాయకులు లక్ష్మణ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.