. . . నగరంలో సిపిఎం నాయకుల ధర్నా
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో అక్రమ అరెస్టులు, నిర్బంధాన్ని మానుకోవాలని సీపీఎం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదావారం గాంధీ చౌక్ లోని గాంధీ విగ్రహం వద్ద సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ,ఇతర ప్రతిపక్ష పార్టీలు జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన సందర్భంలో నిరసనకారులను ఎక్కడికక్కడ అక్రమంగా నిర్బంధించడంతో పాటు ఢిల్లీ మొత్తం కర్ఫ్యూను తలపించే విధంగా అప్రకటిత ఎమర్జెన్సీని ప్రకటించి భారీకేట్లను మిలిటరీని వేలాదిమంది పోలీసులను ప్రయోగించి సిపిఎం పార్టీ నాయకులను పార్టీ కార్యాలయం నుండే దౌర్జన్యంగా పార్టీ అఖిల భారత కార్యదర్శి బేబి, పొలిటబ్యూరో సభ్యులను రోడ్ల పైన ఈడ్చుకెళ్తూ, సిజెపి నాయకులను విమానంలోనే అక్రమంగా చొరబడి అరెస్టులు చేయటంతో పాటు, వామపక్ష ప్రజాసంఘాల నాయకులను దారుణంగా పోలీస్ స్టేషన్లకు తరలించారని వేలాది మందిని నిరసనకారులను అరెస్టులు చేసి నిర్బంధించటం దారుణమన్నారు. ప్రజాస్వామ్యతంగా శాంతియుత నిరసనకు పిలుపునిచ్చిన ప్రజలను ఎమర్జెన్సీని తలపించే పద్ధతుల్లో భయానక వాతావరణంలో సృష్టించటం నరేంద్ర మోడీ ప్రభుత్వానికే చెల్లిందని, ఒక వ్యక్తిని కాపాడటం కొరకు కోట్లాదిమంది ప్రజల మనోభావాలను లెక్కలోకి తీసుకోకపోవడం నిరంకుశత్వానికి నిదర్శనం అని తెలిపారు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్బంధం వీడనాడి, ప్రజల కోరిక మేరకు గణేష్ కుమార్ ను బర్తరఫ్ చేయాలని పోలీస్ బలగాలను వెనక్కి తీసుకోవాలని, అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు విగ్నేష్ నగర నాయకులు అనసూయమ్మ, ఉద్ధవ్, అంజయ్య, శంషాద్దీన్, ఇ.వి ఎల్ నారాయణ,రాజు, యశ్వంత్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.