Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 March 2025, 6:02 pm Posted by : ramakrishna

అక్రమ నియామకాలు రద్దు చేయాలి

వామపక్ష విద్యార్థి సంఘాల డిమాండ్

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీలో వివిధ సబ్జెక్టు విభాగాలలో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలు అక్రమ పద్ధతులు జరిగాయని వెంటనే ఆ నియమకాన్ని రద్దుచేసి మరల నోటిఫికేషన్ విడుదల చేసి నియమ నిబంధనలు పరంగా నియామకం చేపట్టాల్సిందిగా పీడీఎస్యూ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ ఉపకులపతి చాంబర్ ముందు ధర్నా, వీసీకి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.నరేందర్, డాక్టర్ కర్క గణేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం,ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ అధ్యక్షులు శివ మాట్లాడుతూ, ఫిబ్రవరి 24న తెలుగు,ఇంగ్లీష్, ఫార్మా సిటికల్ కెమిస్ట్రీ, సోషల్ వర్క్ డిపార్ట్మెంట్లో గెస్ట్ ఫ్యాకల్టీ కొరకు నోటిఫికేషన్ యూనివర్సిటీ రిజిస్టర్ ద్వారా విడుదల చేశారన్నారు. కానీ ఈ నోటిఫికేషన్ వారి డిపార్ట్మెంట్ నోటీసు బోర్డు మీద తప్ప పత్రిక ప్రకటన ఇవ్వకుండా గోప్యంగా ఉంచడం దుర్మార్గమన్నారు. పాఠశాల స్థాయిలో కూడా ఎటువంటి చిన్న నియామకం జరిగిన పత్రిక ప్రకటన ఇవ్వడం జరుగుతుందన్నారు. విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీ రిక్రూమెంట్ జరుగుతున్న విషయం ఎవరికీ తెలియకుండా తమకు కావలసిన వారికి మాత్రమే ఇచ్చే విధంగా దొంగ చాటున నియామకం చేపట్టడం సిగ్గుచేటన్నారు. వెంటనే ఇట్టి నియమకం రద్దుచేసి మరల నోటిఫికేషన్ విడుదల చేసి పత్రిక ప్రకటన ద్వారా తెలియజేసి నియమ నిబంధనలు పాటిస్తూ అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగాలు అందే విధంగా భర్తీ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జరగబోయే పరిణామాలకు తెలంగాణ యూనివర్సిటీ వీసీ,రిజిస్టర్లు బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణ యూనివర్సిటీ అవినీతి అక్రమాలకు నిలయాలుగా మారిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని అకాడమిక్ వాతావరణాన్ని పెంపొందించే దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు చరణ్,రాజు ఏఐఎస్ఎఫ్ యూనివర్సిటీ కో కన్వీనర్ సంజయ్,చందు, నవీన్, ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ నాయకులు అజయ్,రాజేష్,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.