- అభ్యర్థులందరి ఒరిజినల్ సర్టిఫికెట్లను బహిరంగ విచారణ చేయాలి
- అక్రమ నియమకలపై కమిషన్ ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలి
- కామారెడ్డి విద్యార్థి సంఘాల డిమాండ్
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి మెడికల్ కళాశాలలో జరిగిన అక్రమ నియామకాలను వెంటనే రద్దు చేయాలని జిల్లా కేంద్రంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గురువారం విలేకరుల సమావేశ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘల నాయకులు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా మెడికల్ కళాశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు నియామకాలు అక్రమంగా జరిగాయని మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వలేదని రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదని అన్నారు. ఇదే విషయమై విద్యార్థి సంఘల ఆధ్వర్యంలో గత కొన్ని రోజుల నుంచి నిరసనలు చేయడం జరుగుతుందన్నారు. కలెక్టర్ కి అలాగే ఉన్నతాధికారులకు విన్నవించిన చర్యలు తీసుకోకుండా అక్రమ నియమకలపై అధికారులు మౌనం ఉండటం దానికి నిదర్శనమే అని ఉద్యోగాల అక్రమ నియామకాలు జరిగాయని తెలుస్తుందన్నారు. నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి ఉద్యోగాలు ఇచ్చారని బలమైన కారణాలు ఉన్నప్పటికీ అభ్యర్థులు విన్నవించినప్పటికీ కలెక్టర్ గారు స్పందించకపోవడం సరైంది కాదన్నారు. ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో ఉన్న సిబ్బందిపై అలాగే కామారెడ్డి మ్యాన్ పవర్ ఏజెన్సీ నిర్వాహకులపై ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల యూపీఐ ట్రాన్సాక్షన్ గూగుల్ పే ,ఫోన్ పే చెక్ చేయాలన్నారు. ఉద్యోగాలు పొందిన వారి సర్టిఫికెట్లను కమిషన్ ఏర్పాటు చేసి బహిరంగంగా వెరిఫై చేయాలన్నారు. అప్లై చేసుకున్న నిరుద్యోగుల సర్టిఫికెట్లను కూడా వెరిఫై చేయాలన్నారు. వెంటనే అక్రమ నియమకాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.లేనియెడల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బివియం రాష్ట్ర కార్యదర్శి జీవియం విఠల్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ముదాం అరుణ్ కుమార్, పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు సురేష్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు, జి వి ఎస్ జిల్లా అధ్యక్షులు వినోద్ కుమార్, నిరుద్యోగులు రవి , గణేష్ తదితరులు పాల్గొన్నారు.