. . . మూడవ రోజుకు చేరిన ఐకెపి వివోఏ ల నిరవధిక సమ్మె
రుద్రూర్, బతుకమ్మ :
ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలంటూ రుద్రూర్ మండల కేంద్రంలోని మండల సమీకృత కార్యాలయం ఎదుట ఐకెపి వివోఏలు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం నాటికి మూడవ రోజుకు చేరింది. ఈ సందర్భంగా అధ్యక్షురాలు జరీనా బేగం మాట్లాడుతూ.. వీవోఏలకు కనీస వేతనం 26,000 వేల రూపాయలు ఇవ్వాలని, పని భారం తగ్గించాలని, అర్హులైన వివోఏలకు సీసీలుగా పదోన్నతి కల్పించాలని, 58 జీవో ను సవరించాలని, వివోఏలకు సాధారణ & ఆరోగ్య బీమా సౌకర్యం రూ.20 లక్షల వరకు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ సమ్మెలో ఉపాధ్యక్షురాలు జిజియా భాయ్ , కార్యదర్శి జి.స్వరూప, సహాయ కార్యదర్శి నాగరాణి, కోశాధికారి లావణ్య తదితరులు పాల్గొన్నారు.