Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 July 2025, 7:43 pm Posted by : ramakrishna

ఐకెపీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

వేల్పూర్, బతుకమ్మ : తెలంగాణాలో ప్రభుత్వం మహిళాలకు ఇందిరా క్రాంతి పథం ద్వారా అందిస్తున్న ఋణలను రెగ్యులర్ గా చెల్లెస్తూ, ఋణలను సద్వినియోగం చేసుకొని ఆర్ధికంగా ఎదగాలని నేషనల్ లెవెల్ మానిటరింగ్ కమిటీ మెంబెర్స్ సుధాకర్ రెడ్డి, లోహిత్ రెడ్డిలు సూచించారు.  నేషనల్ లెవెల్ మనిటరింగ్ కమిటీ మెంబర్లు మంగళవారం వేల్పూర్ మండలం కేంద్రంతో పాటు మండలంలోని ఆక్లూర్, కొమన్ పల్లి గ్రామాలను సందర్శించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లోకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనులు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. ఈ సందర్బంగా సెంట్రల్ టీం మండల కేంద్రం తో పాటు మండలంలోని కొమన్ పల్లి, ఆక్లూర్ గ్రామాల్లోని ఎన్నరీజీయస్ పనులైన సీ సీ రోడ్డులు, వేల్పూర్ మండల కేంద్రంలో ఈత వానలను ఉపాధి కూలీలు చేసిన పనులను పరిశీలించారు. కొమన్ పల్లి లో భాగ్యలక్ష్మి మహిళ గ్రూప్ సభ్యులు తీసుకొన్నా ఋణలు, వాటి వినియోగం, చెల్లింపులకు సంబందించిన బుక్స్ ను పరిశీలించారు. సందర్శించిన గ్రామాల్లోకి అంగన్ వాడి కేంద్రాల నిర్వహణను గురించి తెలుసుకొన్నారు. ఈ సందర్బంగా ఉపాధి కూలీలు, పెన్షనర్ లతో ఇంట్రాక్షన్ నిర్వహించారు. ఎన్ ఎల్ ఎం టీం వెంట ,ఎంపీడీవో పంచాయతీరాజ్ ఈఈ, డీఈ, ఏ.ఈలు ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది ఏపీఓ,టిఏ, ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.