- అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్
మాక్లూర్, బతుకమ్మ : ఐకేపి కేంద్రాలు రైతులను ఆగం చేస్తున్నాయని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ అన్నారు. మాక్లూర్ మండలం ఓడ్డాట్ పల్లి గ్రామంలో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆదివారం రైతులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంటా సక్రమంగా జరగడం లేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే లారీలు తెప్పించాలని అన్నారు. లారీలు లేక కాంటపెట్టిన సంచులను తీసుకపోకుండా రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. నెంబర్ సీరియల్ గా ఉన్న ప్రైవేట్ లారీలు తెస్తేనే కాంట పెడతామని రైతులకు అంటున్నారని, ప్రైవేట్ లారీలు రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారు అని అన్నారు. ఒక సంచికి పది రూపాయలు ఇస్తేనే లోడ్ చేస్తామని ప్రైవేటు లారీలు అంటున్నారని తెలిపారు. కనీసం అధికారులు పట్టించుకోవడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. కలెక్టర్ స్పందించి లారీలు తెప్పించి నిలిచిపోయిన కాంటైన సంచులను వెంటనే తీసుపోవాలని కాంటవేగవంతం చేయాలని ఆయన కోరారు. లేకుంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చారించారు. ఈ కార్యక్రమంలో రైతుల పాల్గొన్నారు.