Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 July 2025, 7:15 pm Posted by : ramakrishna

ఐకెపి ఏపిఎం శ్యామ్ బదిలీ

బతుకమ్మ, ఏర్గట్ల : ప్రభుత్వ ఉద్యోగంలో బదిలీలు సహజమే నని ఎంపీడీఓ  వెంకటేశ్వర్లు అన్నారు. ఏర్గట్ల మండలానికి ఎపిఎం శ్యామ్ ఎంతో క్రమశిక్షణతో సేవలను అందించి సాధారణ బదిలీల లో భాగంగా ఏర్గట్ల మండలం నుండి మోర్తాడ్ మండలానికి బదిలీపై ఎపిఎం గా వెళ్తున్నా  శ్యామ్ ను  ఏర్గట్ల ఎంపీడీఓ వెంకటేశ్వర్లు,ఎంపీఓ శివ చరణ్,ఐకేపి సిబ్బంది,  పంచాయతీ కార్యదర్శులు, శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఇట్టి సందర్భంలో ఏపీఎం శ్యామ్ మాట్లాడుతూ ఏర్గట్ల మండలంలో తనకు సహకరించిన ప్రభుత్వ ఉద్యోగులకు ఐకెపి సిబ్బందికి మాజీ ప్రజా ప్రతినిధులకు పత్రిక విలేకరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను,ఈ కార్యక్రమం లో ఎంపీడీవో వెంకటేశ్వర్లు,ఎంపిఓ శివ చరణ్,ఐకెపి సీసీలు సంతోష్, నవీన్, మండల పరిధిలోగల పంచాయతీ కార్యదర్శిలు ఫీల్డ్ అసిస్టెంట్లు,తదితరులు, పాల్గొన్నారు.