ఐఐహెచ్ఎఫ్ డబ్ల్యూ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ డా. కవితా రెడ్డి కి సన్మానం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా డా. కవితా రెడ్డి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా, నిజామాబాద్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్‌తో పాటు వైద్యులు, సిబ్బంది మంగళవారం ఆమెను మర్యాదపూర్వకంగా కలుసుకుని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ డా. కవితా రెడ్డి నియామకం రాష్ట్ర ఆరోగ్య రంగానికి మరింత బలం చేకూర్చే నిర్ణయమన్నారు. ఆమెకు ఉన్న అనుభవం, దూరదృష్టి ఆరోగ్య సేవలను గ్రామీణ స్థాయికి...