Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 8:03 pm Posted by : ramakrishna

ఐఐహెచ్ఎఫ్ డబ్ల్యూ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌ డా. కవితా రెడ్డి కి సన్మానం

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా డా. కవితా రెడ్డి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా, నిజామాబాద్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్‌తో పాటు వైద్యులు, సిబ్బంది మంగళవారం ఆమెను మర్యాదపూర్వకంగా కలుసుకుని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ డా. కవితా రెడ్డి నియామకం రాష్ట్ర ఆరోగ్య రంగానికి మరింత బలం చేకూర్చే నిర్ణయమన్నారు. ఆమెకు ఉన్న అనుభవం, దూరదృష్టి ఆరోగ్య సేవలను గ్రామీణ స్థాయికి విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. వైద్య విద్య, ప్రజారోగ్య రంగాల్లో సరికొత్త మార్పులు తీసుకురావడంలో ఆమె నాయకత్వం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఐఐహెచ్ఎఫ్ డబ్ల్యూ కీలక పాత్ర పోషిస్తుందని, డా. కవితా రెడ్డి ఆధ్వర్యంలో సంస్థ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.