Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 October 2025, 4:59 pm Posted by : ramakrishna

సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించిన ఐజిపి చంద్రశేఖర్ రెడ్డి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లో గల నడి రోడ్డుపై ఒక నేరస్తుడి చేతిలో హత్యకు గురైన సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని కంఠేశ్వర్ బ్యాంకు కాలనీలోని ఆయన నివాసం హాజరై కానిస్టేబుల్ ప్రమోద్ భౌతిక గాయానికి ఐజిపి చంద్రశేఖర్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య దురదృష్టకరమన్నారు.ఈ ఘటన తమను తీవ్రంగా కలిసి వేసిందన్నారు. సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి కుటుంబానికిఅన్ని విధాలుగా పోలీస్ శాఖ నుండి ఆదుకుంటామని నేరస్తుడు అయిన రియాజ్ మహారాష్ట్ర  సరిహద్దుల్లోకి పరి పోయాడని సమాచారం మేరకు పోలీసులు 9 బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు అతి త్వరలో నేరస్తుని పట్టుకుంటామన్నారు.