- జిల్లా నాయకుడు జెగ్గ రాములు
ఇందల్వాయి,బతుకమ్మ: ఇందల్వాయి మండల కేంద్రంలోని అణగారిన వర్గాల పైన చిన్నచూపు చూసినట్లయితే సహించేది లేదని జిల్లా నాయకులు రాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటరాని అనే పదం వాడినట్లయితే వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవించనున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ కులాలందరూ ఒకే తాటి పైకి వచ్చి పైకి వచ్చి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల కొరకు పోరాడాలని అప్పుడే స్వాతంత్రం వచ్చినట్లు అవుతుందని ఆయన పేర్కొన్నారు. దీనిపైన అగ్రవర్ణాల కులాలు పెత్తందారితనం వ్యవస్థను నిర్మిలించవచ్చని ఆయన అన్నారు. దీనిని అందరూ గమనించాల్సిన పరిస్థితి ఉందన్నారు. రాబోయే కాలంలో మరింత అగ్రవర్ణాల కులాలు ఉన్న వారు మాల మాదిగ అంటూ కించపరచ విధంగా చూసేలా ఉన్నట్లు తెలుస్తుందన్నారు. ముందస్తుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులు యువకులు, నాయకులు అందరూ ఏకతాటిపైకి వచ్చి అగ్రవర్ణాల కులాల పైన పోరాటం చేయాల్సిన అవసరం వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మాజీ అధ్యక్షులు దాసరి గంగాధర్, పూజలు రవికుమార్, వీరయ్య, లక్ష్మణ్, జానీ తదితరులు ఉన్నారు.