గ్రామీణ ప్రాంతాల్లో ఐజీడీ సేవలు అభినందనీయం

బతుకమ్మ, నిజామాబాద్ రూరల్ : వర్ని మండలం జాలాల్పూర్, జకోర్, అలాగే డిచ్పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి గ్రామాల్లో ఐజీడీ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ డెవలప్‌మెంట్) సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం కలజాత కార్యక్రమం ద్వారా ఆరోగ్య అవగాహన కల్పించారు. అయోడిన్ లోపం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా జరిగే ప్రయోజనాల గురించి ప్రజలకు వివరించారు. సమతుల్య ఆహారం అనేది చురుకైన జీవితానికి మూలస్తంభమని తెలిపారు. శక్తి ఉత్పత్తి, కణజాలం, జీవక్రియ నియంత్రణ, రోగనిరోధక శక్తి వ్యవస్థ పనితీరులో ఆహారం ముఖ్య...