బ్లోమింగ్ బడ్స్ స్కూల్ లో ఇఫ్తార్ విందు..
బోధన్, బతుకమ్మ రంజాన్ పండుగను పురస్కరించుకొని బోధన్ పట్టణంలోని బ్లోమింగ్ బడ్స్ స్కూల్ లో మంగళవారం రాత్రి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులు పాల్గొని ఒకరినొకరు పండ్లు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ ఫయాజ్ అలి, ఇంచార్జ్ శ్రీధర్ గౌడ్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయురాలు తదితరులు పాల్గొన్నారు.