. . . రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఉసురు తాకుతుంది
. . . నీ బావమరిది నీ కుటుంబ సభ్యుల స్కామ్ ల నుంచి తప్పించుకునేందుకే ఈ డ్రామాలు
. . . మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
తెలంగాణ జాతిపిత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ని సిట్ విచారణ కోసం పిలవడం దురదృష్టకరమని, కేసీఆర్ ను టచ్ చేస్తే అగ్నిగుండమేనని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిజామాబాద్ మాజీ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాలతో కలిసి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. కేసీఆర్ కు విచారణకు ఎందుకు పిలిచారని ప్రశ్నించడం లేదని కానీ పిలిచిన విధానాన్ని తప్పుపడుతున్నామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆయన బామ్మర్ది చేస్తున్న బొగ్గు స్కాం కేసుల గురించి మాట్లాడితే ప్రశ్నించిన వారిపై కేసులు పెడతారా అని ప్రశ్నించారు. కేటీఆర్, హరీష్ రావు పై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తే భయపడతారని అనుకుంటున్నారేమో కానీ బీఆర్ఎస్ నాయకులు ఎవ్వరు భయపడరనని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని నిరసన చేసుకునే హక్కు మాకు లేదా అని ప్రశ్నించినప్పుడు మీరు ఇప్పుడు చేసే పని ఏంటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బావమరిది, వారి కుటుంబ సభ్యులు చేస్తున్నస్కామ్ ల గురించి మాట్లాడినందుకు కేసులు విచారణ పేరుతో పిలుస్తున్నారని ఆరోపించారు. టెలిఫోన్ ట్యాపింగ్ మీ గురువు చంద్రబాబు నాయుడు చేయలేదా నీ గుండె మీద చేయి వేసుకొని చెప్పు, వైయస్ రాజశేఖర్ రెడ్డి, మన్మోహన్ సింగ్ లు ట్యాపింగ్ చేయలేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర, దేశ రక్షణ కోసమే సెక్యూరిటీలో భాగంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని, దానికి మంత్రులకు, ముఖ్యమంత్రికి సంబంధం ఉండదని, నీ ప్రభుత్వం ప్రస్తుతం ఫోన్ ట్యాంపరింగ్ చేయడం లేదా అని ప్రశ్నించారు. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసులతో టచ్ లోనే ఉన్నారని, ఆయన ఎర్రబెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉండి విచారణకు నేను వస్తానని చెప్పినా కూడా ఇంటికి నోటీసులు అతికించి అగౌరవపరచడం ఎంతవరకు సమంజసమన్నారు. తెలంగాణ సాధించిన వ్యక్తి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా ఉంచిన వ్యక్తిని అగౌరవపరుస్తారా అని అన్నారు. నిరసన వ్యక్తం చేస్తే దిష్టిబొమ్మ ఎత్తుకెళ్లిన పోలీసులు నల్ల జెండాలను పోగేసి నిప్పు అంటించే లోపే కార్యకర్తలను అరెస్టు చేశారన్నారు. ప్రజలు నిన్ను నమ్మి ఓట్లు వేస్తే మీరు చేసింది ఏమీ లేదని, ఆరు గ్యారంటీ ల పేరుతో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన మీరు ఏమి చేయలేకపోయారని విమర్శించారు. మీరు ఎన్ని కేసులు పెడితే బీఆర్ఎస్ అంత బలపడుతుందన్నారు. ఒక్క పిలుపుకే వేలాదిమంది కార్యకర్తలు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి పద్ధతి మార్చుకోవాలని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి రైతుబంధు, రైతు బీమా, మహాలక్ష్మి పథకం, మహిళలకు స్కూటీలు ఇవన్నీ ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు సిర్ప రాజు, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్ ఠాకూర్, సత్య ప్రకాష్, దండు శేఖర్, జగత్ రెడ్డి, పార్టీ లీగల్ సెల్ మధు సూదన్, పులి జైపాల్ తదితరులు పాల్గొన్నారు.
