మాంజా అమ్మితే కఠిన చర్యలు
బతుకమ్మ, మాచారెడ్డి: సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకునే గాలి పటాలు ఎగుర వేయడానికి ఉపయోగించేమాంజా దారం అమ్మినా, కొన్నా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని మాచారెడ్డి ఎస్ఐ అనిల్ తెలిపారు. మండల ప్రజలు ఎవరు కూడా గాలిపటాలు/పతంగులు ఎగర వేసేటప్పుడు కాటన్ దారాలు మాత్రమే వాడాలని ఆయన సూచించారు. ఎట్టి ఏపరిస్థితుల్లో నిషేధిత చైనా మాంజా ను వాడరాదని స్పష్టం చేశారు. ఎవరైనా చైనా మాంజా అమ్మినా, నిలువ చేసినా, రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా చైనా...