Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 January 2025, 6:34 pm Posted by : ramakrishna

మాంజా అమ్మితే కఠిన చర్యలు

బతుకమ్మ, మాచారెడ్డి: సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకునే గాలి పటాలు ఎగుర వేయడానికి ఉపయోగించేమాంజా దారం అమ్మినా, కొన్నా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని మాచారెడ్డి ఎస్ఐ అనిల్ తెలిపారు. మండల ప్రజలు ఎవరు కూడా గాలిపటాలు/పతంగులు ఎగర వేసేటప్పుడు కాటన్ దారాలు మాత్రమే వాడాలని ఆయన సూచించారు. ఎట్టి ఏపరిస్థితుల్లో నిషేధిత చైనా మాంజా ను వాడరాదని స్పష్టం చేశారు. ఎవరైనా చైనా మాంజా అమ్మినా, నిలువ చేసినా, రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా చైనా మాంజ అమ్మినట్లయితే 8712686151 నెంబర్ కి కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు.
రోడ్డు భద్రతా నియమాలతో ప్రమాదాలను నివారించండి
రోడ్డు భద్రతా నియమాలు వాహన దారులు పాటించి ప్రమాదాలను నివారించాలని మాచారెడ్డి ఎస్ఐ అనిల్ సూచించారు. మాచారెడ్డి చౌరస్తా లో ప్రజలకు రోడ్డు భద్రత నియమాల తో పాటు సైబర్ క్రైమ్ ఆన్ లైన్ మోసాల గురించి, 100 డయల్ ఉపయోగాల పైన అవగాహన కల్పించారు.

If you sell manja, strict action will be taken