కదిలిస్తే కన్నీరే..

పంటచేల్లోనే మొలకకట్టిన సజ్జ కల్లాల్లో తడిసిపోయిన నువ్వు పంట   మోర్తాడ్, బతుకమ్మ: గ్రామ నడిబొడ్డున గల రచ్చబండ దగ్గర చెట్టు కింద రైతుల కూర్చొని ఉంటుండగా ఒక వ్యక్తి గ్రామాన్ని సందర్శించడానికి సంతోషంతో వచ్చారు. రైతును బాగున్నావా..? అని పలకరించాడు. అంతే రైతు కంటినిండా కన్నీరే కనబడింది. గ్రామాల్లో ఉన్న రైతుల పరిస్థితి ఇప్పుడు ఇలాగే కనిపిస్తుందని తెలపడంలో సందేహం లేదు. పంట చేతికొచ్చింది.. కండ్ల ముందు రాశులుగా పోసుకున్నారు.. కల్లాల్లో వడ్లు తడిసిపోవడం.. ఒకపక్క బాధతో ఉన్నప్పటికీ.. మరోపక్క సజ్జ పంట...