Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 March 2025, 3:53 pm Posted by : ramakrishna

ఇష్టపడి చదివితే విజయం మీదే

బతుకమ్మ,మోర్తాడ్: ప్రతి సబ్జెక్టును కష్టపడి కాక ఇష్టపడి చదవాలని అప్పుడే విజయం మీ సొంతం అవుతుందని పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు సంతోష్ కుమార్ అన్నారు. పదవ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని మనోధైర్యం అందించారు. ఇది పరీక్షల సమయం కాబట్టి విద్యార్థులు ఆరోగ్యం పట్ల అప్రమత్తత కలిగి ఉండాలని కోరారు. మంగళవారం మోర్తాడ్ మండలంలోని సుంకేట్ గ్రామంలోని జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు అందించడం జరిగింది. విద్యార్థులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.