Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 July 2025, 12:57 am Posted by : ramakrishna

కాసులు ఇస్తే డిఎంహెచ్ఓలో నేనే సెట్ చేస్తా

  • ప్రైవేట్ ఆసుపత్రులకు అపరిచిత వ్యక్తి ఫోన్ కాల్స్
  • వైద్య ఆరోగ్య శాఖలో  కలకలం

 

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగిని అంటు అపరిచిత వ్యక్తి జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్ లు, (డయాగ్నోస్టిక్ సెంటర్) ల్యాబ్ లకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్న ఉదంతం అధికారుల ధ్రుష్టికి వచ్చింది. ఆసుపత్రులకు సంబంధించిన రిజిస్ట్రేషన్, రెన్యూవల్ వ్యవహరాలను తానే పర్యవేక్షిస్తున్నానని చెబుతు ఫోన్ చేసి డబ్బులు ఇస్తే తానే అన్ని చూసుకుని దగ్గరుండి పనిచేసి పెడుతానని చెబుతున్నట్టు తెలిసింది. సీజ్ చేయబడిన వాటిని కుడా తెరిపిస్తానని హమీలతో ఫోన్ లు చేస్తున్నట్టు తెలిసింది. నిజామాబాద్ జిల్లా ప్రైవేట్ మెడికల్ హబ్ అని చెప్పాలి. ఇక్కడ సూపర్ స్పెషాలిటీ వైధ్యంతో పాటు నాసిరకం వైద్యం, నాసిరకం వైద్యులు ఉన్నారు. ఇటీవల కాలంలో జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ పోలీస్, అగ్నిమాపక శాఖ పలు ప్రైవేట్ హస్పిటల్ లను తనిఖీ చేసి కొన్నింటిలో నకీలీ వైద్యుల కారణంగా, అర్హతలేని వ్యక్తులు వైద్యం చేస్తున్నారని కొన్నింటికి నోటీసులు ఇవ్వడం, కొన్నింటిని మూసివేయడం జరిగింది. అదే విధంగా అనుమతులు లేనివి, రెన్యువల్ కాని వాటికి నోటీసులు ఇచ్చారు. ఇదే అదనుగా ఈ వ్యవహారం తెలిసిన వ్యక్తులు డిఎంహెచ్ ఓ కార్యాలయం ఉద్యోగిగా చెప్పుకుంటు వసూళ్ల పర్వానికి తెరలేపినట్లు తెలిసింది. కొందరు డబ్బులు ముట్ట చెప్పి తమ పనికోసం జిల్లా అధికారి కార్యాలయానికి రావడంతో ఈ వ్యవహరం వెలుగు చూసింది.

  • జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..

ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్ లు, స్కానింగ్ కేంద్రాలకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగి పేరిట జరుగుతున్న వసూళ్ళ వ్యవహరం ఆ శాఖను కుదిపేస్తుంది. ప్రధానంగా అనుమతులు, రెన్యూవల్ అనేది, ముఖ్యంగా సీజ్ చేసిన వాటి గురించి సంబంధిత ఆసుపత్రుల నిర్వహకులకు, వైధ్య ఆరోగ్య శాఖకు మాత్రమే సమాచారం ఉన్నచోట ఆయా ఆసుపత్రులకు ఫోన్ లు పైకం ముట్ట చెబితే పనులు చక్కబెడుతానని ఫోన్ చేస్తున్న వ్యక్తి అపరిచితుడా లేక వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వారి సంబందికుడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణిగా డాక్టర్ రాజశ్రీ బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలో వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎఏన్ఎం పోస్టులు ఇప్పిస్తామని కొందరు మోసాలకు పాల్పడ్డారు. ప్రధానంగా ఆయా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ జాబితా బయటకు రావడంతో అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి తనకు రూ లక్ష నుంచి 2 లక్షలు ఇస్తే ఉద్యోగం గ్యారంటీ అని లేకపోతే మెరిట్ జాబితాలనుంచి పేరు గల్లంతు అని ఫోన్ లు చేసిన ఉదంతం బహిర్గతమైంది. కొందరు తమ వద్ధ డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇవ్వలేదని నేరుగా ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం విశేషం. ఈ వ్యవహరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన ఈ కేసు ఇప్పటికీ తేలనే లేదు. తాజాగా ప్రైవేట్ హస్పీటల్స్, స్కానింగ్ సెంటర్ లు, డయాగ్నోస్టిక్ సెంటర్ లకు అపరిచితులు డబ్బుల కోసం డిమాండ్ చేయడం కలకలం రేపుతోంది.

  •  మోసపూరిత కాల్స్ నమ్మవద్ధు..  వైద్య ఆరోగ్యశాఖలో ఫిర్యాదు చేయండి : డియంహెచ్ఓ డా. రాజశ్రీ

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగిని అని అపరిచిత వ్యక్తి చేస్తున్న మోసపుకాల్స్ నమ్మవద్ధు. వారికి జిల్లా వైద్య  ఆరోగ్యశాఖకు ఎలాంటి సంబంధం లేదు. జిల్లా వైద్య  ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి ఫోన్ చేసి  వ్యక్తి గత వివరాలు, సమాచారం కోరరు. పర్యవేక్షణ విషయంలో క్షేత్రస్థాయికి వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితోనే  ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సేంటర్ లు, ల్యాబ్ లను తనిఖీ చేయడం జరుగుతుంది. అనుమానిత ఫఓన్ నెంబర్ ల ద్వారా అపరిచితులు డియంహెచ్ఓ కార్యాలయం పేరుతో ఫోన్ లు చేస్తే స్పందించవద్ధు. అలాంటి మోస పూరిత కాల్స్ పై ఫిర్యాదు చేస్తే చట్ట రిత్యా చర్యలు తీసుకుంటాం.