షబ్బీర్ పై ఆరోపణలు చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారు
. నగరాభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు . బీజేపీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు అసత్య ఆరోపణలు మానుకోవాలి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నిజామాబాద్ నగరాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, ఆయనపై అసత్య ఆరోపణలు చేసే వారికి ప్రజలే బుద్ధి చెబుతారని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కేశ వేణు అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. షబ్బీర్ అలీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎప్పటికప్పుడు చర్చిస్తూ నిజామాబాద్ నగర, జిల్లా అభివృద్ధి కోసం...