. . .వందేళ్ల తరువాత కుల గణన జరుగుతుంది
. . . బిసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
నిజామాబాద్, బతుకమ్మ:
కులమే రక్ష. కులమే బలం. కులమే రేపటి ఆశ.. బీసీ కుల గణన జరిగితేనే మన హక్కులు మనకు చెందుతాయి అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని మేరు భవన్ లో జరిగిన బీసి కులగణన పై గురువారం జరిగిన బీసీ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. దాదాపు 100 ఏళ్ల తర్వాత మన బీసీ కుల గణన జరుగుతుంది… మనమెంతో మనకంత రిజర్వేషన్లు రావాలంటే ఈ కులగణన జరగాల్సిందే అన్నారు. సోదరులకు బాబా సాహెబ్ అంబేద్కర్ పుణ్యాన వారెంతో వారికి అంత రిజర్వేషన్లు వచ్చాయి. కాని పట్టుమని 8 శాతం కూడ లేని అగ్రవర్ణాలు 10 ఈ డబ్ల్యూఎస్ పేరుతో రిజర్వేషన్లు సాధించారు. మనం ఎవరికి వ్యతిరేకం కాదు కాని మన బీసీలకు రాజ్యాంగబద్ధ అధికారాలు లేవు అదే విధంగా రాజకీయ అధికారాల అండదండలు లేవు కాబట్టే మనకు అన్యాయం జరుగుతుందన్నారు. ఎప్పుడో వంద ఏండ్ల కిందట 1931 లో బ్రిటీష్ పరిపాలనలో జరిపిన కులగణనలో మనం 54 శాతం ఉన్నామని తెలిసింది. అప్పుడు కేవలం 30,40 కులాలే మన బీసీ ల లిస్టులో ఉండే, ఇప్పుడు దాదాపు 130 కులాలు ఉన్నాయి ఇప్పుడు మనం దాదాపు 60 శాతం ఉంటాము అన్నారు. ప్రస్తుతం బిసీ ముద్ధు బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ చోరవతొనే రాష్ర్టంలో కులగణన సాధ్యమైందని అన్నారు. మనమెంతో మనకు అంత వాటా దక్కాల్సిందే ఈ బీసీ కులగణన జరిగితేనే మన రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్దత వస్తదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్, ఉద్యోగ సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్, బుస్స ఆంజనేయులు, ఆకుల ప్రసాద్, కరిపే రవిందర్, ధర్శనం దేవేందర్, పోల్కం గంగాకిషన్, కొయ్యాడ శంకర్, శ్రీలత, నారాయణ రెడ్డి,సత్యప్రకాశ్, భూమన్న, పూల్గం హన్మాండ్లు, శ్రీనివాస్, లక్ష్మణా చారి, హనుమంత్ రావు, గంగాధర్, సాయిలు, భిక్షపతి, కోడూరి స్వామి, నగేష్, సుధర్శన్, బాలన్న తదితరులు పాల్గొన్నారు
