మన మీద మనకు పూర్తి విశ్వాసం ఉంటే అనుకున్నది సాధిస్తారు

మోర్తాడ్ బతుకమ్మ:మన మీద మనకు పూర్తి విశ్వాసం ఉంటే ఒక్క అరుణిమ సిన్హా, మాలావత్ పూర్ణ లాగా ఏదగవచ్చని మోటివేషనల్ స్పీకర్ శ్రీహరి అన్నారు. మోర్తాడ్ మండలంలోని సుంకేట్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు పెద్ది సంతోష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించబడిన మోటివేషనల్ సెమినార్ కి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి ఆరు అంశాలపై విద్యార్థులు తమ వ్యక్తిత్వాన్ని మార్చుకుంటే లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చు అన్నారు. వైఖరి, నమ్మకం, నియంత్రణ, క్రమశిక్షణ, సామర్థత, దృష్టి ఈ ఆరు...