ఇథనాల్ ఫ్యాక్టరీని నిలిపివేయకుంటే పురుగుల మందు తాగి సస్తాం
నిర్మల్ - భైంసా రహదారిపై మహిళల రాస్తారోకో నాయకులు కనిపించుట లేదంటూ ఫ్లెక్సీలు ఆర్డిఓను అడ్డుకున్న మహిళలు రాత్రి వరకు కొనసాగుతున్న నిరసన నిర్మల్, బతుకమ్మ : పురుగుల మందు తాగి ప్రాణాలైనా అర్పిస్తాం కానీ తమ గ్రామాల మధ్య ఇథనాల్ ఫ్యాక్టరీని అడ్డుకొని తీరుతామంటూ గుండంపల్లి, దిలావర్పూర్, కంజల్, లోలం గ్రామాలకు చెందిన మహిళలు రోడ్డెక్కారు. తమ గ్రామాలలో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్ధని 124 రోజులుగా రిలే నిరహర దీక్షలు చేస్తుంటే ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదంటు మంగళవారం నిర్మల్- బైంసా 44వ...