వీడీసీ రుగ్మతను దూరం చేయకపోతే భవిష్యత్తులో ఈ జాడ్యం మరింత ప్రమాదకరం
. . . రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ నిజామాబాద్ , బతుకమ్మ : దశాబ్దాల కాలంగా పాతుకుపోయిన విలేజ్ డెవలప్ మెంట్ అరాచకాల రుగ్మతను దూరం చేయకపోతే భవిష్యత్తులో ఈ జాడ్యం మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ ఆవేదన వెలిబుచ్చారు. జిల్లాలోని ఏర్గట్ల మండలం తాళ్ళరాంపూర్ లో వీడీసీ 30 గౌడ కుటుంబాలను, 10 ఎస్సీ కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేసిన విషయంపై వచ్చిన ఫిర్యాదులను తెలుసుకుని...