Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 September 2025, 6:12 pm Posted by : ramakrishna

విద్యార్థి ఉన్నత స్థానంలో ఉంటే అదే గురుదక్షిణ

మోర్తాడ్, బతుకమ్మ : విద్యార్థులు భవిష్యత్తులో మంచి స్థానంలో ఉన్నట్లయితే అదే గురుదక్షిణ అని పాలెం ఆదర్శ రైతు కుంట శ్రీనివాస్ అన్నారు. మోర్తాడ్ మండలంలోని పాలెం ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని, తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆయన చేసిన సేవలను కొనియాడారు. అనంతరం పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ప్రధానోపాధ్యాయులు వేణుగోపాలరావు, ఉపాధ్యాయులు నరసింహ స్వామి ,చంద్రశేఖర్, రాజేందర్, త్రివేణి, మమత, సైఫ్ అలీ రికాంట్ అసిస్టెంట్లను సన్మానించినందుకు ధన్యవాదములు తెలుపడం అయినది. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

If the student is in a high position, that is Gurudakshina.