Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 August 2024, 5:56 pm Posted by : ramakrishna

హామీలు అమలు చేయకుంటే అసెంబ్లీని ముట్టడిస్తాం

. . .సీపీఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి.రామకృష్ణ

  బతుకమ్మ, భీంగల్

అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని తక్షణమే నెరవేర్చాలని లేనిపక్షంలో అసెంబ్లీని ముట్టడిస్తామని సీపీఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి.రామకృష్ణ అన్నారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఎంపీడీవో సంతోష్ కి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ బీడీ కార్మికులకు జీవనభృతిని 4016 పెంచుతామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చారన్నారు. అమలు విషయంలో 9 నెలలు గడుస్తున్నాఉలుకు పలుకు లేదన్నారు. బీడీ కార్మికులు రేక్కాడితే గాని డొక్కాడని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. ఒక నెలలో పని దినాలు కనీసం కూడా లేదన్నారు. బీడీ కార్మికులకు సంబంధించిన ప్రత్యామ్నయ ఉపాధిని చూపాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బీడీకార్మికులకు ఇచ్చే జీవనభృతిని 2016 నుంచి 4016 కు పెంచి అమలు చేస్తామన్నారు కానీ జీవన భృతి పెంపు విషయములో ఏ మాత్రం కదలిక లేదన్నారు. గతంలో పెన్షన్ అమల విషయంలో మనం మన యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాడడం వలన జీవన భృతి సాధించుకోవడం జరిగిందని ఇప్పుడు కూడా ఆందోళన చేయకుంటే అమలు కాదని ఆయన గుర్తు చేశారు. అందుకే కార్మికులు ఐక్యంగా పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకొని ప్రభుత్వం మెడల్వంచ సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి రమేష్ ,జిల్లా ఉపాధ్యక్షులు సత్తేవ్వ,జిల్లా నాయకులు రాజేశ్వర్,మండల నాయకులు అరవింద్,సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) డివిజన్ నాయకులు నడ్పినర్సయ్య,దామోదర్,బాబన్న,మండల నాయకులు ఆశిస్,ప్రణీత్,భీడికార్మికులు లలిత, పద్మ, లక్ష్మి,రాజు, గంగు, స్వేచ్చ, రాజు,నశ్రీన్ భేగం,సంజీ, తస్లిమ్ తదితరులు పాల్గొన్నారు.

If the promises are not implemented, we will besiege the Assembly