Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 April 2025, 8:29 pm Posted by : ramakrishna

పోలీసులు చట్టాన్ని అతిక్రమిస్తే చట్టపరంగానే పోలీసుల సంగతి చూస్తాం

  • తులం బంగారం అడిగితే లాఠీ ఛార్జా..?
  • పోలీస్ జులుం నశించాలి
  • రోడ్డుపై బైఠాయించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

 

భీమ్ గల్, బతుకమ్మ : కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి కార్యక్రమంలో జిల్లా ఇంచార్జీ మంత్రిని తులం బంగారం ఇస్తామని ఎన్నికల్లో చెప్పారు. లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వాలని శాంతి యుతంగా ప్లే కార్డులు పట్టుకొని బీయర్ఎస్ నాయకులు అడిగితే పోలీసులు లాఠీ ఛార్జీ చేయడం అమానుషమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుధవారం భీమ్ గల్ లో జరిగిన కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ చెక్కుల పంపిణి కార్యక్రమంలో భాగంగా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు రాగ తులం బంగారం ఇచ్చే విషయం ముఖ్యమంత్రికి మీ ద్వారా తెలియజేయాలనీ ఎమ్మెల్యే చెప్పిన అనంతరం బీయర్ఎస్ నాయకులు తులం బంగారం విషయం శాంతియుతంగా నిరసన తెలపగా పోలీసులు విచక్షణ రహితంగా లాఠీ ఛార్జ్ నిర్వహించి దొరికిన వారిని దొరికినట్లు కొట్టారు. అంతే కాకుండా తాజా మాజీ ఎంపిపి ఆర్మూర్ మహేష్ ను నెట్టేషారు. దాంతో మహేష్ కింద పడగా గాయాలయ్యాయి.మంత్రి కార్యక్రమం ముగించుకొని వెళ్ళగానే పోలీసుల జూలుం నశించాలంటూ ఎమ్మెల్యే తన అనుచరులతో సహస్ర యూ టర్న్ వద్ద బైటయించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డైలీ నాట్ సండే ఇవ్వాళా భీమ్ గల్ సీ. ఐ స్థానిక కాంగ్రెస్ నాయకులు చెబితే చట్టాన్ని అతిక్రమించి స్పెషల్ పార్టీ పోలీసులకు చెప్పి వాంటెడ్లీ లాఠీ ఛార్జ్ చేశారని, మేము చట్టానికి అనుగుణంగా పోలీసుల సంగతి చూస్తామని హెచ్చరించారు. ఇప్పటి వరకు శాంతియుతంగా ఉన్నామని ఇకపై ఎవ్వరిని ఉపేక్షించేది లేదన్నారు.భీమ్ గల్ టౌన్ సీ ఐ తన సొంత జాగీరు అనుకుంటున్నడని, నేను ఇంకా రాజకీయాల్లో ఉంటానని, సమయం వచ్చినప్పుడు ఇలాంటి చట్టాన్ని అతిక్రమించి వ్యవహరించే పోలీసులకు తగిన గుణపాఠం చెబుతామని అన్నారు.అమానుషంగా లాఠీ ఛార్జ్ చేసిన సీ ఐ, స్పెషల్ పోలీసులపై సీ. పీ విచారణ జరిపి వారిపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇలాంటి లాఠీ ఛార్జ్ లకు, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, అందరం ఉద్యమం నుంచి వచ్చినోళ్ళామేనని ప్రశాంత్ రెడ్డి పోలీసులకు గుర్తు చేశారు. సీ పీ సంఘటన స్థలానికి రావాలని, కాంగ్రెస్ డౌన్ డౌన్, సీ ఎం డౌన్ డౌన్ అంటూ, పోలీస్ జూలుం నశించాలని, ప్రశాంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ బీయర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. సుమారు గంట బైటయించిన అనంతరం బాల్కొండ సీఐ శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేను సముదయించాలని చూడగా సీ పీ రావాలని, భీమ్ గల్ సీ ఐ రావాలని అన్నారు.గంటన్నర అనంతరం సీపీ ఆదేశం మేరకు ఏ సీ పీ వెంకటేశ్వర్ రెడ్డి సంఘటన స్థలానికి వచ్చి ఏమ్మెల్యే తో మాట్లాడి భాద్యులపై విచారణ జరిపి తగిన చర్యలు చెప్పాడుతామని తెలపగా ధర్నాను  విరమించారు. లాఠీ ఛార్జ్ లో దెబ్బలు తగిలిన వారికి పట్టణంలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో చికిత్స చేయించారు.

If the police violate the law, we will deal with the police legally.