తల్లి బిడ్డకు సరైన పోషణతో ఆహారం ఇస్తే ఆరోగ్యంగా ఉంటారు
ఆరోగ్యవంతమైన రాష్ట్ర నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ఎమ్మెల్యే భూపతి రెడ్డి నిజామాబాద్ రూరల్, బతుకమ్మ: తల్లి బిడ్డకు సరైన పోషణతో ఆహారం అందిస్తే ఆరోగ్యంగా ఉంటారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి అన్నారు. గురువారం గుండారం గ్రామంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ మాసం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లి ఆరోగ్యంగా ఉంటే కుటుంబం, సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు....