Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 October 2024, 6:46 pm Posted by : ramakrishna

మొబైల్ పోతేసి.ఇ. ఐ.ఆర్ పోర్టల్ లో ఫిర్యాదు చేయండి

. . . కామారెడ్డి జిల్లాలో 20 లక్షల విలువైన సెల్ పోన్ ల రికవరీ

. . . కామారెడ్డి ఎస్పీ సింధూ శర్మ

 కామారెడ్డి, బతుకమ్మ:                                                                       

సెల్ ఫోన్ల రికవరీ కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ టీం ద్వారా సత్ఫలితాలు వచ్చాయని నెల రోజుల వ్యవధిలోనే  కామారెడ్డి జిల్లాలో 152 ఫోన్ల రికవరీ చేయడం జరిగిందని వాటి  విలువ సుమారుగా  రూ.20 లక్షలు  అని జిల్లా ఎస్పీ సింధు శర్మ  తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయం  సెల్ పోన్ రికవరి చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ సింధూ శర్మ అభినందించిన ఆనంతరం మాట్లాడుతు….. దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న సెల్ ఫోన్ల రికవరీ కోసం గత నెల రోజుల క్రితం జిల్లాలో స్పెషల్ టీంను ఏర్పాటు చేసి, ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు.

 

if the mobile goes. Complain in CEIR portal ఇప్పటి వరకు సిఇఐఆర్ పోర్టల్ ద్వారా 2020 సెల్ ఫోన్ లను గుర్తించి బాధితులకు అందించడం జరిగిందన్నారు. ఇందులో గత నెల రోజుల క్రితం ఏర్పాటు చేయనడిన స్పెషల్ టీమ్ ద్వారా -152 సెల్ ఫోన్ లను  రికవరీ చేయడం జరిగందని, మొబైల్ రికవరీ మేళా కార్యక్రమం ద్వారా బాధితులకు అందించడం జరుగుతుందన్నారు. సెల్ ఫోన్ దొంగతనాల నుండి విముక్తి కల్పించడానికై సిఐఇఆర్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ఈ పోర్టల్ ద్వారా మంచి ఫలితాలు రాబట్టడం జరుగుతుందన్నారు. ఎవరైన మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే  పోర్టల్ నందు బ్లాక్ చేసి, సంభందిత పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు. మొబైల్ ఫోన్ రికవరీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బంది రాజు, శ్రీనివాస్, ఇర్ఫాన్, వినోద్, రాజ్ కుమార్ లనుఎస్పీ ప్రత్యేకముగా అభినందించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ  అడ్మిన్ కె  నరసింహారెడ్డి ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు