Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 December 2024, 9:07 pm Posted by : ramakrishna

ఇచ్చిన హామీలను విస్మరిస్తే ప్రజాగ్రహం తప్పదు

  • రైతులను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
  • వ్యవసాయకూలీలకు శటగోపం పెడుతున్న ప్రభుత్వాలు
  • సీపీఐ (ఎం.ఎల్)మస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి.ప్రభాకర్

కమ్మర్ పల్లి, బతుకమ్మ : ఇచ్చిన హామీలను విస్మరిస్తే ప్రజా ఆగ్రహం తప్పదని సీపీఐ (ఎం. ఎల్) మాస్ లైన్ స్టేట్ సెక్రటరియట్ మెంబర్ వి . ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు. మంగళవారం కమ్మర్ పల్లి మండల కేంద్రంలో సీపీఐ (ఎం. ఎల్)మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ఎన్నికల ముందు కేంద్రంలోని మోడీ, రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ఒకవైపు రైతులను, మరోవైపు కూలీలను ధగా చేస్తున్నారన్నారు . వ్యవసాయ సాగుచట్టాలను రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు విస్మరించారని, ఢిల్లీలో రైతంగా పోరాటానికి కనీస మద్దత్తు ధర చట్టం చేస్తాం అని మోడీ వ్రాతపూర్వకంగా హామీ ఇచ్చి ఇప్పుడు అమలుకు పూనుకోవడం లేదన్నారు . రైతు సంబరాలు జరపడమే కాదు రైతుల సమస్యలను పరిష్కరించాలని అయన డిమాండ్ చేశారు.కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయకూలీలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని,ఉపాధి హామీ పధకం కింద కూలీలకు కల్పించాల్సిన పని దినాలను తగ్గించి కూలీల పొట్టకొడుతున్నారన్నారు. రాష్ట్రంలో భృతిని ఇవ్వడంలో మినా,మేశాలు లెక్కిస్తున్నారన్నారు.కేవలం 100 రోజులు పని చేసిన ఉపాధి కూలీలకే భృతి ఇస్తమానడం,కూలీలను విస్మరించడమేనాన్నరు. ఇప్పటికైనా రైతులు, కూలీల పట్ల కేంద్రం ప్రభుత్వాలు తమ వైఖరిని మార్చుకోకుంటే పెద్దఎత్తున పోరాటాలు నిర్మిస్తాం అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ,సీపీఐ(ఎం. ఎల్) మాస్ లైన్ జిల్లా, డివిజన్, మండల నాయకులు ఎస్.సురేష్,ఆర్.రమేష్, బి. కిషన్,జి.సత్తెవ్వ,కె.రాజేశ్వర్,జి.కిషన్,ఎం. ఎం.నరేంధర్,ఆర్.దామోదర్,ఈ.రమేష్,,ఎం.డీ అనిస్ జి.అరవింద్ తదితరులు పాల్గొన్నారు.