Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 September 2024, 5:53 pm Posted by : ramakrishna

హామీలు అమలు చేయకుంటే అసెంబ్లీని ముట్టడి

  • ఇచ్చిన హామీ ప్రకారం జీవనభృతి 4016 అమలు చేయాలి
  • సిపిఐ (ఎం. ఎల్ )మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి.రామకృష్ణ డిమాండ్

బతుకమ్మ, సిరికొండ : గత ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలనాన్నింటిని నెరవేర్చి, కార్మికులకు ఇచ్చిన హామీ ప్రకారం రూ. 4016 భృతిని వెంటనే అమలు చేయాలని సీపీఐ(ఎం. ఎల్)మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (టీయుసీఐ) ఆధ్వర్యంలో దర్పల్లి మండల కేంద్రం లోని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఎంపీడీఓ కు వినతిపత్రాన్ని అందించారు.ఈ ధర్నా కార్యక్రమానికి సీపీఐ (ఎం. ఎల్ )మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి.రామకృష్ణ హాజరై ధర్నానుద్దేశించి మాట్లాడారు.ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే అసెంబ్లీని ముట్టడిస్తాం అని, బీడీ కార్మికులకు జీవనభృతిని 4016 పెంచి ఇస్తాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చారన్నారు. అమలు విషయంలో 9 నెలలు గడుస్తున్న ఉలుకు లేదు పలుకు లేదని విమర్శించారు.బీడీ కార్మికులు రేక్కాడితే గాని డొక్కాడని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. బీడీ కార్మికులకు సంబంధించిన ప్రత్యామ్నయ ఉపాధిని చూపాల్సిన అవసరం ఉందని,ఒకవైపు ఉపాధి కరువై శతమతం అవుతుంటే మరోపక్క బీడీ యజమాన్యం అనేక రకాల వెట్టి చేపిస్తూ, అదనపు బీడీల ఎట్టి పేరట నిలువు దోపిడీ చేస్తున్నారన్నారు. బీడీ రంగంలో ఉన్నది ప్రధానంగా మహిళా కార్మికులు అని,కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం బీడీకార్మికులకు ఇచ్చే జీవనభృతిని 2016 నుంచి 4016 కు పెంచి వెంటనే అమలు చేయాలన్నారు.కానీ జీవన భృతి పెంపు విషయములో ప్రభుత్వం లో ఏ మాత్రం కదలిక లేదు అన్నారు. గతంలో పెన్షన్ అమలు విషయంలో మనం మన యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాడడం వలన జీవన భృతి సాధించుకోవడం జరిగిందని ,ఇప్పుడు కూడా మనము ఆందోళన చేయకుంటే అమలు కాదు అని ఆయన గుర్తు చేశారు. అందుకే కార్మికులు ఐక్యంగా పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకొని ప్రభుత్వం మెడలు వంచి సాధించుకోవాలని ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగశీల బీడీ వర్కర్స్ యూనియన్ (టీ యు సీ ఐ ) జిల్లా సహాయ కార్యదర్శి ఆర్.రమేష్, సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) డివిజన్ నాయకులు ఆర్ . దామోదర్, మండల నాయకులు ఈ.రమేష్,ఎం. డి.అనిస్, బి . కిశోర్, కె.ఆశిస్,ఎస్.కిశోర్, ఓ . ఆశన్న, భీడికార్మికులు లలిత, పద్మ, లక్ష్మి, రాజు, గంగు, స్వేచ్చ, రాజు, నశ్రీన్ భేగం, సంజీదా, తస్లిమ్ తదితరులు పాల్గొన్నారు.

If promises are not implemented, lay siege to the assembly