పండగస్తే మా ఊరికి…
నిజాంపేట(మెదక్): సంక్రాంతికి ప్రతి ఊరిలో సంబరాలు జరుగుతాయి. ఈసందర్భంగా ప్రతి ఇంట్లోకి ప్రత్యేక కాంతులు తీసుకొస్తాయి. ధనుఃరాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడోస్తే– పండగ భోగి మంటల్లో పాత ఆలోచనల్ని దహిస్తే– పండగ రేగు పళ్ళు పిల్లలపై పోస్తే ఆయుఃవృద్ధే– పండగ కాగులల్ల ధాన్యరాశి నింపే అన్న వృద్ధే– పండగ ఆడ పిల్ల రంగురంగుల ముగ్గులేస్తే– పండగ జంగమయ్య, హరిదాసుల గాన కీర్తనలే– పండగ గంగిరెద్దు ఇంటిముందు నాట్యమాడే– పండగ కోడి పందేల గెలుపోటముల వెలుగే– పండగ పిండివంటలు,పిల్లల ఆటలముచ్చట్లే– పండగ దేవతలను, ఆరాధించి గొప్పగా...