. . . నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి
ధర్పల్లి , బతుకమ్మ:
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఇండ్లు లేని పేదలు ఉండొద్దు అనేది నా లక్ష్యం .ఇందిరమ్మ ఇండ్ల పేరిట అధికారులు కానీ, తమ పార్టీ నాయకులు కానీ ఒక్క రూపాయి లంచం అడిగితే నేరుగా తనకే ఫోన్ చేయాలని,పథకాల పేరిట ఎవరైనా అవినీతికి పాల్పడితే సహించేది లేదని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. అదివారం ధర్పల్లి మండల కేంద్రంలోని సహకార సోసైటిలో డా. భూపతి రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ…పేదల సొంతింటి కల నెరవేరుస్తాం అని చెప్పి పేదలను మోసం చేశారని ఎక్కడ పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చిన దాఖలాలు లేవని,డబుల్ బెడ్ రూం ఇండ్లు,వివిధ పథకాలు ఇప్పిస్తామని చెప్పి పేదల దగ్గర పేదల దగ్గర డబ్బులు తీసుకున్న ఘనత బిఆర్ఎస్ నాయకులకే చెల్లిందని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు ఉండొద్దు అనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఇప్పటికే రూరల్ నియోజకవర్గంలో మొదటి దశలో 3200 ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభం అయ్యాయని,మరో 1000 ఇండ్లు ప్రారంభం అవుతాయని,అధికారులు సూచించిన విధంగా 400 ఎస్ఎఫ్టీ నుండి 600 ఎస్ఎఫ్టీ లోపల ఇండ్లు నిర్మించుకోవాలని కోరారు. ఎంపిక చేసిన లబ్ధిదారులకు విడతల వారీగా నిధులు వస్తాయని,రెండవ దశలో సొంత స్థలాలు లేని పేదలకు ప్రభుత్వం 75గజాల స్థలం ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇస్తుందని,అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలకు కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకం లో భాగంగా ప్రభుత్వ సహాయం అందుతుందని పేదలందరికీ తప్పకుండా ఇండ్లు ఇస్తామని తెలిపారు. కాళేశ్వరం నీళ్ళు రానప్పటికి రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వానాకాలం పంట దాదాపు కోటి యాబై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు, యాసంగి ఒక కోటి ముప్పై లక్షల మెట్రిక్ టన్నులు మొత్తం రెండు కోట్ల ధాన్యం రైతులు పండించారని, దేశ చరిత్రలోనే ఇది రికార్డు అని పెర్కోన్నారు. నిజామాబాద్ జిల్లాలో 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించడం జరిగిందని,కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విద్యుత్, విత్తనాలు,ఎరువులు ఇస్తూ మద్దతు ధర కల్పించడం వల్లే ఇదంతా సాధ్యమైందని,రైతును రాజును చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని అన్నారు.గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు ధాన్యం అమ్ముకోవడానికి అనేక ఇబ్బందులు పడ్డారని ,వరి తాము కొనుగోలు చేయలేమని,వరి వేస్తే ఉరే అని సాక్ష్యాత్తు కేసీఆర్ చెప్పారని,కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి వల్ల మళ్ళీ వరి కొనుగోలు చేశారని అన్నారు.సన్న వడ్ల కు 500 రూపాయలు బోనస్ ఇవ్వడం వల్ల రైతులకు ఒక్క ఎకరానికి ముప్పై వేల రూపాయల అదనపు ఆదాయం వస్తుందని అన్నారు.
కేసీఆర్ కుటుంబం చిన్నాభిన్నం అవుతుందని హరీష్ రావు పార్టీ మారతారని ప్రచారం జరుగుతుందని ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. కేటీఆర్ లండన్ కు వెళ్లగా,కూతురు కవిత సొంత పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు,కేసీఆర్ కుటుంబం లో ఆధిపత్య పోరు నడుస్తుందని పార్టీ నాయకులే చెబుతున్నారని అన్నారు. భా.రా.స లో నాయకత్వ లోపం ఉందని వారిది ముగిసిన చరిత్ర అని,పార్టీని ఏదో ఇక పార్టీలో విలీనం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని వారిని ప్రజలు ఎప్పుడో మర్చిపోయారని అన్నారు.గత పదేళ్ల ఉద్యోగులను పట్టించుకోని భా.రా.స నాయకులు ఉద్యోగులను రెచ్చగొడుతున్నారని,రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని,అభివృద్ధి పథకాలు,సంక్షేమ పథకాలకు సంబంధించి40 వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో పెట్టారని,రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుండగా కేవలం అధికార దాహంతో ఉద్యోగులను భా.రా.స రెచ్చగొడుతున్నారని,రాష్ట్రం బాగుపడటం వారికి ఇష్టం లేదని కేవలం అధికారమే వారి లక్ష్యం అని అన్నారు.భాజపా అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో అయినా తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్ రాజ్, మాజీ ఐడీసీ ఎంఎస్ మునిపల్లి సాయి రెడ్డి , సొసైటీ చైర్మన్ మల్లిఖార్జున్,జనార్ధన్,నాయకులు చెలిమెల శ్రీనివాస్,నర్సయ్య, మిట్టపల్లి గంగారెడ్డి, మంగిత్య నాయక్,భగవాన్ రెడ్డి,గంగారెడ్డి,ఎబినేజర్ తదితరులు పాల్గొన్నారు.
