Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 January 2025, 7:07 pm Posted by : ramakrishna

ఎమ్మెల్సీగా గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి

నిజామాబాద్, బతుకమ్మ: తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు, టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి క`షి చేస్తానని టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య అన్నారు. నిజామాబాద్ నగరంలోని తపస్(టీపీయూఎస్) ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు విద్యను నిర్లక్ష్యం చేశాయని, గతంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన వారు కూడా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించలేదని అన్నారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. నిజామాబాద్ – మెదక్ – కరీంనగర్ – ఆదిలాబాద్ టీచర్స్ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలువనున్న తనను గెలిపించాలని కోరారు. అనంతరం ఓ ప్రైవేట్ హాలులో ట్రస్మా యూనియన్ లోని స్కూళ్ల కరస్పాండెంట్లు, చైర్మన్ లతో సమావేశమయ్యారు.

If he wins as an MLC, he will work to solve the problems