Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 January 2025, 9:17 pm Posted by : ramakrishna

తప్పుడు ఆరోపణలు చేస్తే ప్లాటు తమదైపోదు

భీమ్ గల్, బతుకమ్మ : తమ అవసరం నిమిత్తం మాభూమిని అజ్మాత్ కు అమ్మగా అట్టి భూమిపై కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తే తమదైపోదని రియాజ్,అర్షద్ కుటుంబసభ్యులు అన్నారు.మంగళవారం పట్టణ కేంద్రంలో వారు నిర్వహించిన ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ భీమ్ గల్ కు చెందిన నేషనల్ టెంట్ హౌస్ యజమాని అజ్మతుల్లా కు నాలుగు ఏండ్ల క్రితం తమ భూమి అమ్మినట్టు రియాజ్, అర్షద్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తాము విక్రయించిన భూమి పై తమకు హక్కులు ఉన్నాయని ముజాహిద్ కుటుంబ సభ్యులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. నాలుగు ఏండ్ల క్రితం తాము అవసరం కొరకు సుమారు ఐదు వందల గజాలు అజ్మత్ కు విక్రయించడం జరిగిందని చెప్పారు. పట్టణం లోని పాత వాటర్ ట్యాంక్ వద్ద విక్రయించిన భూమిలో ముజాహిద్ కుటుంబ సభ్యులకు ఎలాంటి హక్కులు లేవన్నారు. కేవలం ఓనర్ షిప్ సర్టిఫికెట్ తీసుకొని ఒక ప్లాట్ ను వారు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందని పేర్కొన్నారు. అవి తప్పా వారి వద్ద ఎలాంటి డాకుమెంట్స్ లేవని ఏమైనా ఉంటే పక్కా వివరాలతో ముందుకు రావాలని, అనవసరంగా కొనుగోలు చేసిన వ్యక్తులపై తప్పుడు ఆరోపణలు చేయొద్దని సూచించారు. ఈ సమావేశం లో రియాజ్, అర్షద్ కుటుంబ సభ్యులు నసీమ్, ఫహీమా, తస్లిమ్, ఫర్వీన్, బేబీ తబస్సుమ్ పాల్గొన్నారు.