బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలి
హైదరాబాద్, బతుకమ్మ: రాష్ర్టంపై బీజేపీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కాదని పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించడం బాధాకరమని, రాష్ర్టానికి చెందిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఏ ఒక్కరు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బయ్యారం ఉక్కు పరిశ్రమపై కవిత మీడియాతో మాట్లాడారు. ఉక్కు పరిశ్రమ వస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు పెరుగుతాయనేది కేసీఆర్ ఆలోచన అని వెల్లడించారు....