Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 May 2025, 5:51 pm Posted by : ramakrishna

బీసీలు ఐక్యమైతే అద్భుతాలు సృష్టించవచ్చు

  • అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడేది బీసీ హక్కుల సాధన సమితి
  • సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయ నాయుడు 

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అణగారిన వర్గాలైన ఉత్పత్తి కులాల అభ్యున్నతికి పోరాడేది బీసీ హక్కుల సాధన సమితి అని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు ఉద్ఘాటించారు. నిజామాబాద్ లో జరిగిన బీసీ హక్కుల సాధన సమితి జిల్లా మహాసభ బీసీ నాయకులు వై. ఓమయ్య అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. తరతరాలుగా చేతి వృత్తి దారులు, ఉత్పత్తి కులాల వారు అణచివేతకు గురవుతున్నారని వారి హక్కులను సాధించడం కోసం మడమ తిప్పని  పోరాటం చేస్తామని, అందు కొరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండల కేంద్రాలలో నూతన కమిటీల ఎంపిక చేస్తున్నామని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బీసీ ఉద్యమాలలో భాగంగా బీసీ హక్కుల సాధన సమితిని బలోపేతం చేసి మా హక్కుల సాధన కై ఐక్య ఉద్యమాలు నిర్మిస్తామని ఆయన తెలిపారు గత ఎనిమిది దశాబ్దాలుగా  బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి  చాటి  చట్ట సభల్లో రాజకీయ రిజర్వేషన్ కోసం ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తామని, తెలంగాణ రాష్ట్రo వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఉన్న బీసీ ఉద్యమాలు ఐక్య చేసి బీసీ జేఏసి నిర్మాణమే తమ ముందున్న లక్ష్యం అని ఇవాళ దేశవ్యాప్తంగా బీసీలు ఐక్యమవుతున్నారని గతంతోపోల్చుకుంటే ఇది ఎంతో మార్పు అని ఇది హర్షించ తగ్గ పరిణామం అని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టి ఆయా కులాల జనాభా నిష్పత్తి ప్రకారం ప్రతి బడ్జెట్లలోనూ నిధులు కేటాయించాలని అలాగే చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో అందరికీ సమాన వాటా అందించాలని ఆయన కోరారు. నిజామాబాద్ జిల్లా సిపిఐ కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ… దేశంలో బీసీలు మెజారిటీ ప్రజలు గా ఉన్నప్పటికీ ద్వితీయ శ్రేణి పౌరులుగానే బతకాల్సి వస్తోందని, ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రం లో బీసీ ఉద్యమాలు ఉపoదుకోవడం హర్షించదగ్గ పరిణామం అని, ఇటీవల కాలంలో తెలంగాణలో బీసీ కుల గణన జరిగిందని బీసీ సంఘాల ఒత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా దేశ జనగణలలో కులగణన చేపడతామని ప్రకటించడం బీసీల విజయoగా ఆయన అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో  నాయకులు చక్రపాణి, విట్టల్ గౌడ్, శ్రావణ్, పుప్పాల నాందేవ్, డిహెచ్పిఎస్ అధ్యక్షులు కమలాపురం రాజన్న, రేవతి, గోవర్ధన్, రాఘవేందర్, రాధా కుమార్ వివిధ మండలాల బీసీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

If BCs unite, miracles can be created.